న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న పూజా జవేరి - వీడియో వైరల్! 2015లో వచ్చిన 'భం భోలేనాథ్' అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజా జవేరి. తెలుగులో 'ద్వారక', 'రైట్ రైట్', బంగారు బుల్లోడు' వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తెలుగుతో పాటూ హిందీ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసింది. సుమారు 20 కి పైగా కమర్షియల్ టీవీ యాడ్స్ లో నటించింది. రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ తో ఆకట్టుకుంది. పూజ జవేరి న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దాన్ని మీరూ చూసేయండి. Pooja J Jhaveri/Instagram