ప్రపంచంలో EMI ఎలా మొదలైంది?

Published by: Khagesh

ఈఎంఐ మూలాలు క్రీస్తుపూర్వం నాటి ప్రాచీన రోమన్ నాగరికతలోనే ఉన్నాయి. రోమన్లు ఇళ్లు, భూములు కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకునేవారు.

1750లో లండన్‌ ఫర్నిచర్ వ్యాపారులు వస్తువును తీసుకెళ్లి, డబ్బులను నెలవారీ వాయిదాల్లో చెల్లించే పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

19వ శతాబ్దం ప్రారంభంలో హైర్ పర్చేజ్ పేరుతో ఒక వ్యవస్థీకృత బిజినెస్ మోడల్‌గా మారింది.

సింగర్ సేవింగ్ మెషిన్ కంపెనీ 1850లలో కుట్టు మిషన్లను ఒక డాలర్ డౌన్ పేమెంట్‌ చేసి మిగతా అమౌంట్‌ను వాయిదాల్లో చెల్లించేలా అమ్మడం ప్రారంభించారు.

అమెరికా జనరల్ మోటార్స్ కంపెనీ 1919లో కార్లను ఈఎంఐ పద్ధతిలో ఫైనాన్స్ అందించడం ప్రారంభించింది.

1950లో డైనర్స్ క్లబ్ ప్రపంచంలోనే మొట్టమొదటి క్రెడిట్ కార్డును పరిచయం చేసింది.

1958లో బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్యాంక్ అమెరికార్డ్ తెచ్చింది. ఇదే నేటీ వీసా కార్డుగా మారింది.

క్రెడిట్‌ కార్డులు EMIలను మరింత డిజిటలైజ్ చేసింది.

భారతదేశంలో 1980లు, 90ల ఆర్థిక సంస్కరణల తర్వాత ఈఎంఐ క్రమంగా విస్తరించింది.