ఈకామర్స్ సైట్లలో ఇప్పుడు ప్రత్యేక అమ్మకాలు జరుగుతున్నాయి. భారీ డిస్కౌట్లు ఆఫర్ చేస్తున్నారు.

అయితే వారు ఇచ్చే డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు మాత్రమే కాదు .. మరిన్ని తగ్గింపులు పొందవచ్చు.

నిజానికి ఆయా కంపెనీలు ప్రకటించే వాటిలో చాలా తక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

కొన్ని వస్తువులు సేల్ కు ముందు కూడా అదే ధరలో అందుబాటులో ఉంటాయి

ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు దాని ధర చరిత్రను తనిఖీ చేయండి

మూడు లేదా ఆరు నెలల్లో ఉత్పత్తి కోసం అత్యల్ప ధర చూడండి. ఒక ప్లాట్‌ఫారమ్‌పై మాత్రమే ఆధారపడకండి

వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వస్తువును సరిపోల్చండి . కొన్నిచోట్ల ధరలు తక్కువగా ఉంటాయి.

గణనీయమైన డిస్కౌంట్లను పొందడానికి ధర తగ్గింపు హెచ్చరికను సెట్ చేయండి