జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఇప్పటం గ్రామానికి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు పోలీసులు అడ్డుకోవడంతో నడుచుకుంటూనే ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు పవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటన కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర పవన్ నడిచి వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ దీంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గి వాహనాల్లో వెళ్లేందుకు పవన్‌కు అనుమతి ఇచ్చారు. ఇప్పటంలో బాధితులతో మాట్లాడిన పవన్.. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అరెస్టు చేసుకుంటే చేసుకోనివ్వండి అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. హత్యలు చేసే నేతలకు పోలీసులు రక్షణ కల్పిస్తారన్న పవన్