ఓట్స్ ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే గుడ్డులో కూడా ఎన్నో పోషకాలు లభిస్తాయి.
ఓట్స్ - ఒక కప్పు పాలు - అరకప్పు గుడ్లు - మూడు మిరియాల పొడి - చిటికెడు ఉప్పు - రుచికి సరిపడా ఉల్లి తరుగు - మూడు స్పూన్లు పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు కొత్తిమీర తరుగు- ఒక స్పూను క్యారెట్ తురుము - రెండు స్పూన్లు పసుపు - చిటికెడు
ఓట్స్ ను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
ఇందులో తగినన్ని పాలు, కాస్త నీళ్లు చేర్చి దోశెల పిండిలా జారేలా కలుపుకోవాలి.
పిండి కలుపుకున్నాక ఓ పదినిమిషాల మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
ఈలోపు ఒక గిన్నెలో గుడ్లు కొట్టి స్పూనుతో గిలక్కొట్టాలి.
అందులో మిరియాల పొడి, కాస్త పసుపు, ఉప్పు వేసి మళ్లీ బాగా గిలక్కొట్టాలి.
ఓట్స్ దోశెల పిండిలో గుడ్లు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
ఉల్లి తరుగు, కొత్తి మీర తరుగు, పచ్చి మిర్చి తరుగు , క్యారెట్ తురుము వేసి బాగా మిక్స్ చేయాలి.
పెనంపై నూనె వేసి ఆమ్లెట్ లా వేసుకోవాలి.
రెండు వైపులా బాగా కాల్చి ప్లేటులోకి తీసుకోవాలి. దీన్ని చట్నీ లేకుండా తిన్నా చాలా బావుంటుంది.