OPS బెనిఫిట్స్: రిటైర్ అయ్యాక ప్రతి నెలా ఫిక్స్డ్ అమౌంట్ పింఛనుగా వస్తుంది. చివరి జీతంలో సగం పింఛనుగా పొందుతారు.
OPSలో పన్ను, పన్ను ప్రయోజనాలు ఉండవు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే ఓపీఎస్ ఉంటుంది.
NPS బెనిఫిట్స్: ప్రభుత్వ ఉద్యోగుల కోసమే తీసుకొచ్చినా ప్రైవేటు వాళ్లకూ ఛాన్స్ ఇచ్చారు.
నెలవారీ జీతం నుంచే ఎన్‌పీఎస్‌లో కంట్రిబ్యూట్ చేస్తారు. ఆ మొత్తాన్ని మార్కెట్ అనుబంధ సాధనాల్లో పెట్టుబడిగా పెడతారు
సెక్షన్ 80C కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80CCD (1B) కింద రూ.50 వేల వరకు అదనపు మినహాయింపు లభిస్తుంది.
ఉద్యోగి రిటైర్ అయ్యాక మొత్తం ఫండ్ నుంచి 60% విత్‌డ్రా చేసుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత దీనిపై టాక్స్ ఉండదు.
మిగిలిన 40 శాతం డబ్బుతో ఆన్యూటీ ప్లాన్ కొనుగోలు చేసుకోవాలి. దాన్నుంచి ప్రతి నెలా పింఛను ఇస్తారు. దీనిపై టాక్స్ ఉంటుంది.
2004 నుంచి సైనిక దళాలను మినహాయించి కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ను అమలు చేస్తున్నారు.
వేతనంలో 10% నెలవారీ జమ చేయాలి. ప్రభుత్వమూ సమానంగా ఇస్తుంది. 2019 నుంచి కంట్రిబ్యూషన్ రేట్‌ను 14%కు పెంచారు.
18-65 ఏళ్ల మధ్య వయస్కులు ఎన్‌పీఎస్ పథకంలో చేరేందుకు అర్హులు. రాజకీయ విభేదాలతో కొన్ని స్టేట్స్ ఓపీఎస్ వైపు మళ్లుతున్నాయి!