హైదరాబాద్‌లో ఇల్లు కొనాలని చాలామంది ఆశ! ఓ ఇంటిని సొంతం చేసుకుంటే ఉండే సంతృప్తే వేరు! హౌజ్‌ హ్యాకింగ్‌తో మీ కల నిజం చేసుకోవచ్చు!

అమెరికా వంటి పశ్చిమ దేశాల్లో ప్రాచుర్యం పొందిన హౌజ్ హ్యాకింగ్‌ గురించి ఇక్కడ చాలామంది తెలియదు.

సొంత డబ్బు లేదా బ్యాంకు రుణంతో ఒక ప్రైమ్‌ లొకాలిటీలో ఇల్లు కొని కొంత భాగాన్ని ఇతరులకు అద్దెకు ఇవ్వడమే హౌజ్‌ హ్యాకింగ్‌.

ఐటీ కారిడార్లు, ఉద్యోగం చేసే చోటకు దగ్గర్లో ఇంటిని తీసుకుంటే ఈ కాన్సెప్ట్‌ బాగా వర్క్‌ అవుతుంది. అద్దెతో ఈఎంఐలు చెల్లించొచ్చు. లేదా కొంత భారం తగ్గించుకోవచ్చు.

సహోద్యోగులకే హౌజ్ హ్యాకింగ్కు ఇస్తే ఇంధన ఖర్చులు, ప్రయాణ భారం తగ్గించుకోవచ్చు. ట్రాఫిక్‌ జామ్‌ల్లో టైమ్‌ వేస్ట్‌ అవ్వదు. బిల్లుల్ని సమంగా పంచుకోవచ్చు.

హౌజ్ హ్యాకింగ్ ప్రాబ్లమ్స్: ఒకే ఇంటిలో టెనంట్‌ ఉంటే మీ సొంత ఇంటిలా అనిపించదు. టెనంట్‌ ప్రవర్తన బాగా లేకున్నా, ఇంటి అద్దె చెల్లించకపోయినా, అద్దెకు ఎవరు రాకపోయినా ఇబ్బందిగా ఉంటుంది.

ఇబ్బందులు రావొద్దంటే మల్టీ యూనిట్‌ ప్రాపర్టీ తీసుకోవడం బెస్ట్‌. ఉదాహరణకు డూప్లెక్స్‌ లేదా ట్రిప్లెక్స్‌. వీటివల్ల ఎక్కువ అద్దె వస్తుంది. ఇండిపెండెంట్‌ స్పేస్‌ దొరుకుతుంది.

ఒకవేళ పెట్టుబడికి మీ వద్ద ఎక్కువ బడ్జెట్‌ లేకుంటే అటాచ్‌డ్‌ బాత్‌రూమ్‌లు ఉండేలా 2-3 బెడ్‌రూమ్‌లు ఉండే ఇంటిని తీసుకోండి.

ఇంటిని మరింత విస్తరించుకొనేలా బేస్‌మెంట్‌, ఓపెన్‌ ప్లేస్‌ ఎక్కువ ఉన్న ప్రాప్టరీనే కొనుగోలు చేయండి.

ఇల్లు చిన్నగా ఉన్నా ఎక్కువ ఓపెన్‌ ప్లేస్‌ ఉండేలా చూసుకోండి. అదనపు బెడ్‌రూమ్‌లు నిర్మించుకోవచ్చు. కామన్‌ ఏరియా పరంగా జాగ్రత్త వహించండి.