పెళ్లి చేసుకుంటే మతిమరుపు రమ్మన్నా రాదు

మతిమరుపు,చిత్త వైకల్యం ఈ సమస్యలను డెమెన్షియా అంటారు.

మతిమరుపు పెళ్లయిన వారితో పోలిస్తే ఒంటరిగా ఉండే వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్టు ఓ అధ్యయనం తేల్చింది.

అల్జీమర్స్ సొసైటీ చెప్పిన ప్రకారం పెళ్లి కాని ప్రతి 100 మంది ఒకరికి కచ్చితంగా మతిమరుపు ఉంటోందని తెలిపారు.

దీనికి ఒంటరితనం,బాధను పంచుకునే వ్యక్తి లేకపోవడం, లోలోపలే కుంగిపోవడం కారణం కావచ్చని భావిస్తున్నారు.

దాదాపు 6677 మందిపై పరిశోధన నిర్వహించారు.మొదట్లో ఎవరికీ మతిమరుపు వ్యాధి లేదు.

కొన్నేళ్లకు 220మందికి ఈ సమస్య వచ్చింది.వారంతా ఒంటరి వారే.

జ్ఞాపకశక్తిని కోల్పోవటాన్ని అల్జీమర్స్‌ (మతిమరుపు) అంటారు.జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటూ బంధువులను గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటే దాన్ని డిమెన్షియా అంటారు.

ఇది ఒకసారి వచ్చిందా మళ్లీ తిరిగి పోదు. సరైన చికిత్స లేదు.