రాశిమారుతున్న కుజుడు - ఈ రాశులవారికి కష్టాలు తప్పవు



5 నెలల తర్వాత అంగారకుడు వృషభరాశి నుంచి బయలుదేరి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడి సంచారం మిథున రాశిలో మార్చి 12 నుంచి మే 10 వరకూ ఉంటుంది.



మిథున రాశిలో కుజుడి సంచారం వల్ల నాలుగు రాశులవారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి



వృషభ రాశి
అంగారక గ్రహం మిథున రాశిలో సంచరించడం మీకు అనుకూలం కాదు. మాటను అదుపులో ఉంచుకోవాలి. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. మాట విసరకుండా తగ్గి మాట్లాడటం మంచిది. పిల్లలకు మీ సహకారం చాలా అవసరం. కార్యాలయంలో సహోద్యోగులతో కూడా మాట పట్టింపులు ఉండొచ్చు.



మిథున రాశి

మీ రాశిలో కుజుడి సంచారం సమయంలో మీరు మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. కార్యాలయంలోనూ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు బదిలీలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఏదో విషయంలో తరచూ వాదనలు జరుగుతాయి.



వృశ్చిక రాశి
కుజుడు రాశి మార్పు వృశ్చిక రాశి వారికి కూడా అంతగా కలసిరాదు. మిథునంలో కుజుడి సంచారం వల్ల ఈ రాశివారికి మానసిక సమస్యలు తప్పవు. వ్యతిరేక రాజయోగం ఉంటుంది. డ్రైవింగ్ చేసటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.



ధనుస్సు రాశి
మిథున రాశిలో కుజుడి సంచారం అంటే..ధనస్సు నుంచి ఏడో రాశిలో సంచరిస్తున్నట్టు. ఈ సమయంలో ధనస్సు రాశివారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కొంతమంది మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.



భూమికి పుత్రుడు కుజుడు. ఈ గ్రహం ప్రభావం చాలా తీక్షణంగా ఉంటుంది. గొడవలకు ప్రేరేపిస్తాడు. శరీరంలో మలినాలు,విషం తొలగిస్తాడు. కుజగ్రహ ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉంటుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.



వేశపూరిత నిర్ణయాలు తీసుకునేలా ప్రభావితం చేస్తాడు. కామాన్ని, వ్యసనాలని ప్రేరేపిస్తాడు. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రమణ్యస్వామి ఈ స్వామిని పూజిస్తే కుజుడి ప్రభావం తగ్గుతుంది.



నోట్: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.



Images Credit: Pixabay