పాలల్లో పసుపు కలిపి తాగడం మంచిదే.. కానీ ఆ తప్పు చేయొద్దు

Published by: Geddam Vijaya Madhuri

చాలామంది పాలు రాత్రి పడుకునే ముందు తాగుతారు. కానీ తాగిన వెంటనే పడుకోవద్దట.

అలా చేస్తే జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది. ఎసిడిటీ పెరగవచ్చు.

జీర్ణ సమస్యలు పెరిగి.. గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది.

పిత్తాశయ సమస్య ఉంటే రాత్రి తాగకపోవడమే మంచిదట.

రక్తం పలుచబరచే మందులతో కలిపి పాలు తీసుకోవడం మంచిది కాదంటున్నారు.

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న రోగులు తాగకూడదని చెప్తున్నారు.

ఖాళీ కడుపుతో తాగితే కడుపులో మంట రావచ్చు.

పాలలో నల్ల మిరియాలు కలిపితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

శరీర స్వభావాన్ని బట్టి, వైద్యుల సూచనల మేరకు దీనిని తీసుకోవచ్చు.