వేసవిలో కొబ్బరి నీరు తాగే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Published by: Geddam Vijaya Madhuri

కొబ్బరి నీరు శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడుతుంది.

అందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పొటాషియం, మెగ్నీషియం కండరాలను బలపరుస్తాయి.ఇవి శరీరంలో pH స్థాయిని నిర్వహిస్తాయి.

కేవలం కొబ్బరి నీళ్లపైనే హైడ్రేషన్ కోసం ఆధారపడటం సరికాదని చెప్తున్నారు నిపుణులు.

ప్రతిరోజు శరీరానికి 2 నుంచి 3 లీటర్ల మంచి నీరు అవసరం.

కొబ్బరి నీళ్లు ఎక్కువ మోతాదులో కాకుండా ఒక గ్లాసు తాగితే సరిపోతుంది.

అధిక కెఫీన్ కలిగిన పానీయాలు, టీ, కాఫీ వంటి వాటిని తీసుకోవడం మానుకోవాలి.

ఆహారంలో దోసకాయ, పుచ్చకాయ వంటి నీటి శాతం అధికంగా ఉన్న పండ్లను చేర్చుకోవాలి.

వేసవి కాలానికి సాధారణ నీరు, కొబ్బరి నీరు రెండింటినీ తగినంతగా తీసుకోవడం ఉత్తమం.