ఈ వస్తువులు పొరపాటున కూడా సిలిండర్ దగ్గర ఉంచవద్దు

Published by: Shankar Dukanam
Image Source: pexels

గ్యాస్ సిలిండర్ దగ్గర అగ్గిపెట్టెలు, లైటర్లు అస్సలు ఉంచవద్దు. వాటి వల్ల అక్కడ మంటలు చెలరేగే ప్రమాదం ఉంది

Image Source: pexels

సిలిండర్ చుట్టూ కాగితాలు, వార్తాపత్రికలు ఉంచవద్దు. వీటికి సులభంగా మంటలు అంటుకోవచ్చు

Image Source: pexels

గ్యాస్ సిలిండర్ దగ్గర ప్లాస్టిక్ కవర్ సంచులను ఉంచవద్దు. త్వరగా కాలిపోయే ప్రమాదం ఉంది

Image Source: pexels

సిలిండర్ దగ్గర బట్టలు, తువ్వాళ్లు ఉంచవద్దు. వీటి వల్ల అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది

Image Source: pexels

నూనె, నెయ్యి సీసాలను సిలిండర్ లేదా పొయ్యి దగ్గర ఉంచడం మానుకోండి

Image Source: pexels

గ్యాస్ సిలిండర్ చుట్టూ మండే స్వభావం ఉన్నవి, శుభ్రపరిచే వస్తువులను అస్సలు ఉంచవద్దు

Image Source: pexels

కట్టెలు, ఇతర త్వరగా మండే వస్తువులను సిలిండర్ నుండచి దూరంగా ఉంచండి

Image Source: pexels

సిలిండర్ ను బయట నుంచి గాలి తగిలే చోట ఉంచండి

Image Source: pexels

గ్యాస్ వాసన వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిప్పును వెలిగించవద్దు. కరెంట్ స్విచ్లను కూడా తాకవద్దు

Image Source: pexels