నిద్ర సరిపోకపోతే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే

నిద్ర లేకపోవడం వల్ల మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది.

తగినంత నిద్ర లేకపోతే మెదడు సరిగ్గా పనిచేయదు. దీనివల్ల పనిపై దృష్టి పెట్టడం, నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది.

కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, వాపు రావడం, నిద్ర సరిపోకపోవడానికి అత్యంత స్పష్టమైన లక్షణం.

నిద్రలేమి వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

తక్కువ నిద్ర వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. రోజంతా అలసటతో ఉంటారు.

నిద్ర సమయంలో చర్మ కణాలు మరమ్మత్తు అవుతాయి. నిద్ర సరిపోకపోతే చర్మం నిస్తేజంగా, ముడతలు పడినట్లు కనిపిస్తుంది.

మెదడుకు తగినంత విశ్రాంతి లభించకపోవడం వల్ల పగటిపూట తేలికపాటి లేదా తీవ్రమైన తలనొప్పి ప్రారంభమవుతుంది.

ఎక్కువ కాలం తక్కువ నిద్రపోవడం వల్ల రక్తపోటు పెరగవచ్చు.

నిద్ర సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి.