జీడిపప్పు నోటికి రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఇస్తుంది.

జీడిపప్పులో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్ వంటి ఇతర పోషకాలు ఉంటాయి.

అయితే వీటిని రోజుకు ఎన్ని తినొచ్చు. దీనిని తినేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.

రోజుకు పెద్దలైతే 15 నుంచి 18 జీడిపప్పులను డైట్​లో తీసుకోవచ్చు.

అయితే మీ కేలరీలను చెక్ చేసుకుని డైట్​లో తీసుకుంటే మంచిది. లేకుంటే బరువు పెరుగుతారు.

ఎక్కువగా తింటే ఫ్యాట్ పేరుకుపోతుంది. సోడియం ఎక్కువగా ఉంటుంది.

ముఖ్యంగా మీరు వేయించిన, రోస్ట్ చేసిన జీడిపప్పు తింటే మరింత జాగ్రత్తగా ఉండాలి.

సాల్ట్ చేయనివి, డ్రై రోస్ట్ చేయనవి, పచ్చి జీడిపప్పు తింటే మంచిదని చెప్తున్నారు.

అలెర్జీలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారు తినకపోవడమే మంచిది.

ఇది కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.