మామిడి vs అరటి షేక్.. మధుమేహం ఉన్నవారికి ఏది మంచిది?

Published by: Geddam Vijaya Madhuri

మామిడిలో GI కొంచెం ఎక్కువగా ఉంటుంది. అరటిలో కూడా షుగర్ ఉంటుంది. అరటి బాగా పండితే షుగర్ ఎక్కువ అవుతుంది.

మామిడి షేక్‌లో నేచురల్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. అరటి కూడా తీపిగానే ఉంటుంది కానీ మామిడితో పోలిస్తే కొంచెం కంట్రోల్‌లో ఉంటుంది.

అరటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ స్లోగా రక్తంలోకి వెళ్ళేందుకు సహాయపడుతుంది.

ఏ ఫ్రూట్ షేక్ అయినా బ్లెండ్ చేస్తే ఫైబర్ తగ్గి షుగర్ త్వరగా అబ్సార్బ్ అవుతుంది. కాబట్టి షేక్ కంటే ఫ్రూట్‌గా తినడం బెస్ట్.

పాలు కలిపితే కేలరీలు పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు లో-ఫ్యాట్ మిల్క్ లేదా నీటితో చేయడం మంచిది.

మామిడి అయినా, అరటి అయినా ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. చిన్న గ్లాస్ మాత్రమే తాగాలి.

ఉదయం లేదా వర్కౌట్ తర్వాత తీసుకుంటే బాడీ బాగా యూజ్ చేసుకుంటుంది. రాత్రి తీసుకోవడం మంచిది కాదు.

మధుమేహం ఉన్నవారికి మామిడి షేక్ కంటే అరటి షేక్ కొంచెం సేఫ్ ఆప్షన్గా చెప్తారు. కానీ ఏది తీసుకున్నా కంట్రోల్గా తీసుకోవాలి.

షేక్‌ల కంటే పూర్తి పండు తినడం ఇంకా మంచిదని చెప్తున్నారు.

వీటిని డైట్లో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.