భారతదేశంలో అత్యంత ఖరీదైన హోటల్ జైపూర్లోని రాంబాగ్ ప్యాలెస్. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ హోటల్స్​లో ఒకటి.

Published by: Geddam Vijaya Madhuri

సుఖ్ నివాస్ రాయల్ సూట్ ఒకప్పుడు జైపూర్ మహారాజా వ్యక్తిగత గది. ఒక రోజుకు 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు తీసుకుంటారు.

1835 వ సంవత్సరంలో నిర్మించి.. మొదట రాణి దాసి నివాసం, తరువాత జైపూర్ మహారాజు అధికారిక నివాసం, 1957లో లగ్జరీ హోటల్‌గా మార్చారు.

47 ఎకరాల్లో రాజస్థానీ మొఘల్ శిల్పకళా నైపుణ్యం, పాలరాయి చెక్కడాలు, విలువైన తివాచీలు ఇక్కడ చూడవచ్చు.

అతిథులకు బంగారు పళ్ళెంలో 'స్వర్ణ మహల్' రెస్టారెంట్లో ఆహారం వడ్డిస్తారు.

హోటల్లో బస చేసే అతిథులకు పాతకాలపు వింటేజ్ కార్లలో ఘన స్వాగతం లభిస్తుంది.

హోటల్ ప్రాంగణంలో విశాలమైన తోటలలో నెమళ్లు స్వేచ్ఛగా తిరుగుతాయి.

Published by: Geddam Vijaya Madhuri

ఈ హోటల్ తర్వాత తాజ్ లేక్ ప్యాలెస్ ఉదయపూర్ ఖరీదైనది. ఇది పిచోలా సరస్సు మధ్యలో ఉంది.

ఢిల్లీలోని లీలా ప్యాలెస్ మహారాజా సూట్ చాలా విలాసవంతమైనది.

జోధ్పూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ నివాసాలలో ఒకటి.