ఇంట్లోనే ఆర్గానిక్​గా అల్లం, పసుపు పెంచేయండిలా.. ఈజీ టిప్స్

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఈ రోజుల్లో ఇంట్లో సేంద్రీయ వ్యవసాయం చేసే ధోరణి వేగంగా పెరుగుతోంది.

Image Source: pexels

అయితే ఇంట్లోనే అల్లం, పసుపు వంటి మసాలా దినుసులను కూడా ఈజీగా పెంచుకోవచ్చు.

Image Source: pexels

కుండీలలో అల్లం, పసుపు పెంచే సులభమైన పద్ధతి ఏంటో చూసేద్దాం.

Image Source: pexels

అల్లం, పసుపు పెంచడానికి వెడల్పాటి, లోతైన కుండలను ఎంచుకోండి. కుండల లోతు 12 నుంచి 15 అంగుళాలు ఉండేది ఎంచుకుంటే మంచిది.

Image Source: pexels

మట్టికి మంచి నీటి పారుదల ఉండాలి. ఇందుకోసం తోట మట్టి, ఇసుక, పశువుల ఎరువు కలిపి ఉపయోగించాలి.

Image Source: pexels

అల్లం, పసుపు మొక్కలను వాటి మొలకల నుంచి పండిస్తారు. కాబట్టి తాజా, కుళ్ళిపోని ముక్కలను ఎంచుకోండి.

Image Source: pexels

కుండీలో 2-3 అంగుళాల లోతులో అల్లం లేదా పసుపు మొలకెత్తిన భాగాన్ని పైకి ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి మట్టితో కప్పండి. నీరు పోయండి.

Image Source: pexels

అల్లం, పసుపునకు ఎక్కువ నీరు అవసరం లేదు. కానీ మట్టి ఎల్లప్పుడూ కొద్దిగా తేమగా ఉండాలి.

Image Source: pexels

అల్లం, పసుపు సుమారు 8 నుంచి 10 నెలల్లో తయారవుతుంది.

Image Source: pexels