ఒత్తిడిని తక్షణమే తొలగించే ఫుడ్స్.. ఇవి తింటే స్ట్రెస్ మాయం

Published by: Geddam Vijaya Madhuri

స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కొన్ని ఫుడ్స్ తింటే ఒత్తిడి తగ్గుతుందని చెప్తున్నారు.

ఒత్తిడి తగ్గించడంలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది.

మీకు ఆనందాన్ని కలిగించే ఫుడ్ తినేస్తే సగం స్ట్రెస్ వదిలిపోద్దట.

డార్క్ చాక్లెట్లో మెగ్నీషియం ఉంటుంది.

ఈ మెగ్నీషియం ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది.

అవోకాడోలు విటమిన్ బి6కు మంచి మూలం.

ఇది సెరోటోనిన్ హార్మోన్ పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది.

బ్లూ బెర్రీ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.

ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతారు.

చేపలు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి.

దానివల్ల మెదడు పనితీరు ఉత్తమంగా మారుతుంది.

ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లం మూడ్ ని కూడా తాజాగా ఉంచుతుంది.

పాలకూరలో మెగ్నీషియం శాతం ఎక్కువగా ఉంటుంది.

అలాగే పచ్చని ఆకుకూరలు మనస్సును సంతోషపరుస్తాయి.

కొబ్బరి, టమాటాలు కూడా ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.