జీర్ణక్రియ(Gut Health)ను దెబ్బతీసే రోజువారీ అలవాట్లు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

గట్ హెల్త్ పాడైతే తరచుగా కడుపు నొప్పి, పొట్టలో భారంగా అనిపించడం, గుండెల్లో మంట, తేన్పులు, మలబద్ధకం, వికారం ఉంటాయి.

ప్రతిరోజూ కొన్ని చెడు అలవాటు వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపిస్తాయి.

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినే వారి జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం ఉంటుంది.

ఇది ప్రేగుల మైక్రోబయోమ్‌ను భంగం కలిగించగలదు. అలాగే పేగులకు నష్టం కలిగిస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

అలాగే చాలామంది తరచుగా అల్పాహారం మానేస్తారు.లేదా సరిగ్గా తినరు. అలాగే రాత్రిభోజనం చాలా ఆలస్యంగా తింటారు.

సమయానికి తినకపోవడం వల్ల లేదా భోజనం మానేయడం వల్ల ఎంజైమ్‌ల స్రావం యాసిడ్ ఉత్పత్తి, ఇతర కారకాలపై ప్రభావం చూపవచ్చు.

నీరు మొత్తం ఆరోగ్యానికి దోహదపడుతుంది. తక్కువ నీరు తాగే వారికి మలబద్ధకం రావడం సాధారణం.

పోషకాలను శోషించడానికి, విష పదార్థాలను తొలగించడానికి నీరు అవసరం.

ప్రజలు అర్ధరాత్రి వరకు స్క్రీన్ ముందు గంటల తరబడి గడుపుతారు. తరచుగా పని కారణంగా ప్రజలు శారీరక కార్యకలాపాలు చేయరు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.