వేసవిలో వ్యాధులు.. అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Published by: Geddam Vijaya Madhuri

వేసవిలో డీహైడ్రేషన్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి రోజూ తగినంత నీరు తాగడం ముఖ్యం.

వేసవిలో కాటన్ దుస్తులు ధరిస్తే ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. చికాకు తగ్గుతుంది.

ఎండలో ఎక్కువ సమయం పనిచేయడం లేదా నడవడం అవాయిడ్ చేయాలి.

తాజాగా చేసిన.. ఇంట్లో శుభ్రంగా వండుకున్న ఆహారం తీసుకోవాలి.

జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ నుంచి దూరంగా ఉండాలి. లేకుంటే ఇవి వేడిని పెంచుతాయి.

డీహైడ్రేషన్, వేడి ఎక్కువ అయితే మెదడు కూడా పనిచేయడం ఆగిపోతుంది. కాబట్టి శరీరానికి తగినంత నీటిని అందించాలి.

నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి తాజాగా ఉంటుంది. వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

డీహైడ్రేషన్, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోండి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని మరింత హెల్తీగా ఉండండి.