గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది ప్రతి సెకను రక్తాన్ని పంపింగ్ చేయడానికి, జీవితాన్ని కొనసాగించడానికి బాధ్యత వహిస్తుంది. దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడం వలన మీ మొత్తం శరీరం సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఆధునిక వేగవంతమైన జీవనశైలి గుండె జబ్బులను పెంచింది. పేలవమైన ఆహారం, ఒత్తిడి వంటివి గుండె సమస్యలకు కారణమవుతున్నాయి.
మీ రోజువారీ ఆహారంలో పుష్కలంగా ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంది. సమతుల్యమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహార ప్రణాళిక గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
రోజుకు కనీసం 30 నిమిషాలు వేగంగా నడవడం లేదా యోగా, సైక్లింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. గుండె కండరాలను సహజంగా బలపరుస్తుంది.
ధూమపానం, అధిక మద్యపానం రక్త నాళాలను కుంచించుకుపోయేలా చేస్తాయి. రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ అలవాట్లను మానుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరచవచ్చు.
దీర్ఘకాలిక ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. గుండెకు శ్రమ కలిగిస్తుంది. ధ్యానం, లోతైన శ్వాస తీసుకోవడం లేదా శాంతమైన సంగీతం వినడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
7 నుంచి 8 గంటల నిద్ర పూర్తి ఆరోగ్యానికి మద్ధతు ఇస్తుంది. గుండెపై ఎక్కువ ప్రభావం లేకుండా హెల్తీగా ఉంచుతుంది.
అధిక బరువు లేదా ఊబకాయం గుండె మీద అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువును తగ్గుతారు.
ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. తక్కువ సోడియం ఉన్న ఆహారాలను ఎంచుకోండి.