Leo Yearly horoscope 2023
2023 సింహరాశి వార్షిక ఫలితాలు



సింహ రాశి వారు సంవత్సరం ప్రారంభంలోనే చాలా మార్పులు గమనిస్తారు. శని 6వ ఇంటి నుంచి 7వ ఇంటికి చేరుకుంటాడు. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది.



ఏప్రిల్లో శుక్రుడు తొమ్మిదో స్థానంలో సంచరిస్తాడు..ఫలితంగా కెరీర్‌లో పురోగతి ఉంటంది. ఆ తర్వాత బృహస్పతి-రాహువు కలయిక వల్ల మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు..



సంవత్సరం ప్రారంభంలో ఆరవ ఇంట్లో ఉన్న శని మీ ప్రత్యర్థులను ఓడించడానికి, కోర్టు విషయాల్లో విజయాన్ని సాధించడంలో మీకు సహాయం చేస్తుంది.



జనవరి 17న శని ఏడవ స్థానానికి మారుతుంది. ఇది కూడా మీకు వ్యాపారంలో లాభాలనిస్తుంది. విజయావకాశాలు పెంచుతుంది. వైవాహిక జీవితంలో అనుకూలమైన పరిస్థితి ఉంటుంది.



సంవత్సరం ప్రారంభంలో కెరీర్లో మార్పులుంటాయి. మంచి పురోగతి ఉంటుంది



కొత్త ఏడాదిలో సింహరాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సూర్యసంచారం వల్ల తెలివితేటలు పెరుగుతాయి



ఏడాది ఆరంభంలో సంతోషం ఉన్నప్పటికీ రానురాను సమస్యలు పెరుగుతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇబ్బందులుంటాయి. కుజుడి సంచారం వల్ల కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది.



వైవాహిక జీవితం బాగానే ఉంటుంది కానీ..జీవిత భాగస్వామి అనారోగ్యం మిమ్మల్ని కొంత బాధిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది.



ఆరోగ్య పరంగా నిర్లక్ష్యం వహించవచ్చు. సూర్యుడు, బుధుడు 5 వ ఇంట్లో, శని-శుక్రుడు 65 వస్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోకతప్పదు



నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు