ఏడాదికి గుడ్ బై చెప్పేసి కొత్త ఏడాదిలో కోటి ఆశలతో అడుగుపెడతారు. ఈ సమయంలో ఏడాదిలో మొదటి నెల ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలనిస్తోందో చూద్దాం...
మేష రాశి కుంభ రాశిలో సంచరిస్తోన్న శని..మేషరాశివారికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిపెట్టేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. పాత స్నేహితులను కలుస్తారు
కర్కాటక రాశి ఈ రాశివారికి ఈ నెల గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆదాయం బావుంటుంది.
కన్యా రాశి ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూల గ్రహసంచారం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. రావాల్సిన డబ్బు పొందుతారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు సృజనాత్మకంగా ఆలోచించి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తారు.
తులా రాశి ఈ రాశి వ్యాపారులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే నష్టం ఉంటే ఈ నెలలో ఈ సమస్య తొలగిపోతుంది. పెట్టుబడి పెట్టినట్లయితే ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కోకతప్పదు. కంటికి, గొంతుకి సంబంధించిన సమస్యలతో బాధపడతారు
వృశ్చిక రాశి 2023 జనవరి వృశ్చిక రాశివారికి తిరుగులేదు. మీ మాటకు ఎదురులేదు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి ఉంటుంది. పెండింగులో ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తలు
మకర రాశి కొత్త సంవత్సరం మకరరాశి వారికి ఆనంద వసంతాలను పంచబోతోంది. ఆర్థిక రంగం నుంచి మీకు శుభవార్తలు వస్తాయి, మీ కెరీర్‌లో విజయం సాధించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం. పనిభారం తగ్గుతుంది. కొన్ని విషయాల్లో మనశ్సాంతి లోపిస్తుంది.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు