మనిషి మాంసం రుచితో బర్గర్ ఇదొక వింత బర్గర్. తినాలంటే చాలా ధైర్యం కావాలి. దీని రుచి మనిషి మాంసాన్ని పోలి ఉంటుంది. అలాగని మనిషి మాంసంతో తయారు చేసింది కాదు. కేవలం మొక్కల ఆధారిత ఆహారంతోనే తయారుచేశారు. సోయా, పుట్టగొడుగులు, గోధుమలతో పాటూ ఒక రహస్యమైన మొక్కల ఆధారిత మసాలా మిశ్రమంతో తయారు చేశారు. ఇది పూర్తిగా వెజిటేరియన్ ఆహారం. ఈ బర్గర్‌ను పూర్తిగా తింటే అవార్డు కూడా ఇస్తామని ప్రకటించింది అమెరికా బర్గర్ సంస్థ. దీన్ని తినడం కన్నా అసహ్యించుకునేవారే ఎక్కువ.