అమ్మాయిలూ.. మెన్‌స్ట్రువల్ కప్ వాడడం ఇలా క్లాత్‌లకు, శానిటరీ ప్యాడ్స్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చింది మెన్‌స్ట్రువల్ కప్. దీన్ని ఒక్కసారి కొనుక్కుంటే ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు. నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. చుట్టుకొలత 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. సాధారణ రక్తస్రావం అయ్యేవారికి ఇది సరిపోతుంది. దీన్ని వాడడం సురక్షితమే. పదేళ్ల పాటూ దీన్ని వాడుకోవచ్చు. సాధారణ రక్తస్రావం అయ్యేవారికి ఇది సరిపోతుంది. దీన్ని వాడడం సురక్షితమే. పదేళ్ల పాటూ దీన్ని వాడుకోవచ్చు. ఈ కప్ మెత్తగా ఉంటుంది.జననాంగంలోపల పెట్టుకునే ముందు చిన్నగా మడతబెట్టుకోవాలి. ఫోటోలో చూపించినట్టు పెట్టుకున్నాక చేయి వదిలేస్తే మడతలు ఓపెన్ అవుతాయి. టాయిలెట్ బెడ్ పై కూర్చుని పెట్టుకోవడం సులువుగా ఉంటుంది. పెట్టుకున్నాక ఇది లోపల గోడలకు అతుక్కుని ఉంటుంది. ఒకసారి పెట్టుకుంటే 12 గంటలు చూసుకోనక్కర్లేదు. దీన్ని వేడి నీళ్లలో అయిదు నిమిషాలు మరిగించి శుభ్రం చేసుకోవాలి.