అతిగా ఐస్‌క్రీములు తింటే జ్ఞాపకశక్తి తగ్గే ఛాన్స్ ఎండల్లో ఐస్ క్రీములు తినేవారి సంఖ్య ఎక్కువే. చల్లచల్లగా తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. కొంతమంది రోజుకు రెండు నుంచి నాలుగు వరకు లాగిస్తారు. మితంగా తింటే ఎంత లాభమో, ఇలా అతిగా తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఐస్‌క్రీములు అధికంగా తినడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒక పరిశోధన ప్రకారం సంతృప్త కొవ్వులు, చక్కెరతో నిండిన ఈ ఆహారం తినడం వల్ల అభిజ్ఞా నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఐస్‌క్రీము తినడం వల్ల శక్తి రాదు, పైగా నీరసంగా అనిపిస్తుంది. అధిక రక్తపోటు, అధిక బరువు ఉన్నవారు ఐస్ క్రీములను అధికంగా తింటే చాలా ప్రమాదం. దీన్ని తినడం ద్వారా అధికంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు శరీరంలో చేరుతాయి. దీనివల్ల పొట్ట దగ్గరి కొవ్వు పేరుకుపోతుంది. ఒక రోజులో రెండు కన్నా ఎక్కువ ఐస్ క్రీములు తింటే 1000 కంటే ఎక్కువ కేలరీలు శరీరానికి చేరుతాయి. దీనివల్ల క్రమేణా బరువు పెరుగుతారు. రోజుకు ఒక ఐస్ క్రీముకు మించి తినకూడదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.