ప్లాస్టిక్ లేదా ఇతర మెటల్ వాటర్ బాటిళ్లను క్రమం తప్పకుండా వాడే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.

ప్రతిరోజూ రాత్రి పూట వేడి నీరు, మైల్డ్ లిక్విడ్ సోప్ వేసి బాటిల్‌ను బ్రష్‌తో శుభ్రం చేయాలి.

ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఎండలో లేదా వేడిగా ఉన్న కారులో ఎక్కువసేపు ఉంచకూడదు.

వేడి వల్ల ప్లాస్టిక్‌లోని హానికరమైన రసాయనాలు (BPA వంటివి) నీటిలో కరిగిపోయే ప్రమాదం ఉంది.

బాటిల్ లోపలి భాగంతో పాటు, దాని క్యాప్ , థ్రెడ్స్ , లోపల ఉండే రబ్బర్ వాషర్లను కూడా విడిగా తీసి క్లీన్ చేయాలి.

బాటిల్‌ను బోర్లించి పూర్తిగా ఆరనివ్వాలి. తేమ ఉంటే బ్యాక్టీరియా , దుర్వాసన వస్తాయి.

వారానికి ఒకసారి స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా గ్లాస్ బాటిళ్లలో వేడినీరు, కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ వేసి రాత్రంతా ఉంచాలి.

ఒకరి బాటిల్ నుండి మరొకరు నేరుగా నోరు పెట్టి నీళ్లు తాగడం మంచిది కాదు.

ప్లాస్టిక్బా టిల్ రంగు మారుతున్నా, లోపల గీతలు పడినా, వాసన వస్తున్నా వెంటనే దాన్ని మార్చేసి కొత్తది తీసుకోవాలి.

సాధారణ ప్లాస్టిక్ లేదా స్టీల్ బాటిళ్లను డీప్ ఫ్రీజర్‌లో పెట్టి ఐస్ చేయకూడదు.

ప్లాస్టిక్‌కు బదులు స్టెయిన్‌లెస్ స్టీల్, రాగి, గాజు బాటిళ్లను వాడటం ఆరోగ్యానికి అత్యంత సురక్షితం.