మీ పిల్లవాడికి వయసు పెరుగుతున్నా, అతని ఎత్తు పెరగడం లేదా?

Published by: Khagesh

మీ పిల్లలు ఎత్తు పెరగడం లేనట్టైతే మరీ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పిల్లలు పొట్టిగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ఆహారంలో కొన్ని పోషకాలు లోపించడం వల్ల పెరుగుదలకు ఆటంకం కలగవచ్చు.

విటమిన్ డి ఎముకలను బలపరుస్తుంది. దీని లోపం ఎత్తు పెరుగుదల తగ్గుతుంది. దీని కోసం పాలు, గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు తినాలి. ఎండలో నడవాలి.

విటమిన్ సి ఎముకలు, కణజాలాల నిర్మాణానికి చాలా అవసరం. ఇది పెరుగుదల హార్మోన్లకు కీలకమైంది. నారింజ, నిమ్మకాయలు, ఉసిరి, జామకాయ, టమోటాలో పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ బి12 కణ విభజన, DNA సంశ్లేషణకు సహాయపడి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆహారంలో పాలు, గుడ్లు, పెరుగు, కొన్ని మాంసాహార పదార్థాల్లో లభిస్తుంది.

విటమిన్ కె ఎముకల సాంద్రతను కాపాడటానికి సహాయపడుతుంది. ఆకుకూరలైన బ్రోకలీ, పాలకూర, క్యాబేజీ నుంచి పొందవచ్చు

కణాల అభివృద్ధికి విటమిన్ ఎ చాలా అవసరం. ఇది ఎముకల పొడవును పెంచడానికి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

విటమిన్ ఎ కోసం మీరు క్యారెట్లు, బొప్పాయి, పాలు, గుడ్లు, ఆకుపచ్చ ఆకు కూరలు తినేలా చూసుకోండి.

ఫాస్ట్ ఫుడ్ ,జంక్ ఫుడ్ పిల్లల పెరుగుదలను మందగింపజేస్తాయి. వారికి కేవలం పాలు పట్టించడం సరిపోదు; సంపూర్ణ పోషణ చాలా అవసరం.

నిద్ర సమయం, వ్యాయామం మరియు నీరు త్రాగడం కూడా అంతే ముఖ్యం. పిల్లలను ప్రతిరోజూ ఎండలో ఆడుకోనివ్వండి

వారానికి 3-4 రోజులు కనీసం 20-30 నిమిషాల పాటు బయటి తిరిగేలా చూడండి. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమాన మోతాదులో ఉండే సమతుల్య ఆహారాన్ని అందించండి