వేసవిలో డయాబేటిక్‌ రోగులు తినాల్సిన పండ్లు ఇవే!

Published by: Khagesh

వేసవి కాలంలో తాజాదనం, రంగురంగుల పండ్లు వచ్చే కాలం. మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లను ఎంచుకునేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించాలి.

కొన్ని పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతాయి. జాగ్రత్తగా లేకుంటే మాత్రం ప్రమాదంలో పడతారు.

అలాగని అన్ని పండ్లు హానికరం కావు. కొన్ని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అలాంటి పండ్ల గురించి తెలుసుకుందాం.

కివిలో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఆపిల్ పండ్లలో ఫైబర్, పెక్టిన్ ఉంటాయి, ఇవి జీర్ణక్రియకు సహాయపడి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో తోడ్పడతాయి.

పియర్ పండ్లలో కేలరీలు తక్కువగా, పీచుపదార్థం అధికంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని చల్లబరిచి, తేమగా ఉంచుతుంది. సహజ చక్కెర ఉన్నప్పటికీ మితంగా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

మామిడి పండులో చక్కెర ఎక్కువగా ఉన్నప్పటికీ, రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండి, పరిమాణాన్ని పరిమితంగా ఉంచుకుంటే తినొచ్చు.

అయితే రోజూ మామిడి పండు తినడం ప్రమాదకరం. అందుకే వైద్యుని సంప్రదించి వారానికి ఒకటి లేదా రెండు సార్లు తినవచ్చు.