మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ ‘పుష్ప: ది రైజ్’తో టాలీవుడ్‌కు పరిచయమ్యాడు. అతడి కంటే ముందు ‘రాజా-రాణీ’ సినిమాతో ఫహాద్ భార్య నజ్రియా మనకు సుపరిచితం. ‘పుష్ప: ది రైజ్’లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహాద్ ఆకట్టుకున్నాడు. నజ్రియా నాజీమ్ ‘అంటే సుందరానికి..’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. 2014లో ‘బెంగళూర్ డేస్’ సినిమాలో ఫహాద్, నజ్రియా తొలిసారి కలిసి నటించారు. ఫహాద్ తల్లిదండ్రులు నజ్రియాను పెళ్లి చేసుకోవాలని అతడిని కోరారు. నజ్రియా కూడా పెళ్లికి అంగీకరించడంతో అదే ఏడాది ఇద్దరూ ఒక్కటయ్యారు. తాజాగా రంజాన్ సందర్భంగా ఫహాద్, నజ్రియా ఈద్ సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ‘‘మాకు పార్టీ లేదా ఎస్పీ షెకావత్ సాబ్’’ అని మీకు కూడా అడగాలని ఉందా? Images Credit: Nazriya Nazim/Instagram