లోక్‌సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది

పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ పేరుతో మొత్తం 25 హామీలను మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు

జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా, రైట్‌ టూ అప్రంటీస్‌ చట్టం
రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత, పెట్రోల డీజిల్ ధరల తగ్గింపు

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి, ఈ డేటా ఆధారంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు

కులగణన తరవాత రిజర్వేషన్‌లపై ఉన్న 50 శాతం పరిమితి తొలగిస్తామని హామీ

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్‌ కల్పిస్తామన్న కాంగ్రెస్

అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
పెగాసస్, రఫేల్, ఎలక్టోరల్ బాండ్స్‌పై విచారణ

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం.
వ్యవసాయ పరికరాలపై జీఎస్‌టీని మినహాయిస్తామని హామీ

మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళకు ఏటా రూ.1 లక్ష సాయం అందించడం

ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు, యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన