ప్రపంచంలో మొదటిసారి బ్లడ్‌ డొనేట్ చేసింది ఎవరు?

Published by: Khagesh

1665లో బ్రిటీష్ వైద్యుడు రిచర్డ్‌ లోవర్‌ ఒక కుక్క నుంచి మరో కుక్కకు విజయవంతంగా రక్త మార్పిడీ చేశారు.

1667లో ఫ్రాన్స్‌ రాజు లూయిస్‌ XIV వ్యక్తిగత వైద్యుడు జీన్ బాప్టిస్ట్ డెనిస్‌ గొర్రె రక్తాన్ని ఒక బాలుడికి ఎక్కించే ప్రయత్నం చేశారు. కానీ దానికి అనుమతులు రాలేదు.

మనుషుల మధ్య రక్తమార్పిడి 1818లో జరిగింది.

బ్రిటిష్ వైద్యుడు డాక్టర్‌ జేమ్స్ బ్లండెల్‌ దీన్ని విజయవంతం చేశాడు.

డెలివరీ టైంలో మహిళకు అవసరమైన రక్తాన్ని భర్త నుంచి సేకరించారు. అతనే మానవ రక్తదాతగా చరిత్రలో నిలిచిపోయాడు.

అప్పట్లో సిరంజిలతో భర్త రక్తం తీసి నేరుగా భార్యకు ఎక్కించారు.

ఇలా ఎక్కించడం వల్ల చాలా మంది చనిపోయారు. దీనికి కారణాన్ని 1901లో కార్ల్‌ ల్యాండ్‌స్టైనర్‌ గుర్తించారు. ఆయనే ఏ,బీ, ఓ గ్రూప్‌లను కనుగొన్నాడు.

బ్లడ్‌గ్రూప్‌లు కనుగొన్నందుకు కార్ల్‌ ల్యాండ్‌స్టైనర్‌కు 1930లో నోబెల్ బహుమతి లభించింది.

కార్ల్‌ ల్యాండ్‌స్టైనర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏటా జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవగా జరుపుకుంటారు.

1937లో చికాగోలోని కుక్‌ కౌంటీ హాస్పిటల్‌లో బెర్నార్డ్ ఫాంటస్‌ అనే వైద్యుడు ప్రపంచంలోనే మొదటి బ్లడ్‌ బ్యాంకును స్థాపించాడు.

నేడు ఒకరు చేసే రక్తదానం గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలను కాపాడవచ్చు.