ప్రపంచంలోని టాప్ 10 సిటీస్‌ ఇవే! భారత్‌ నగరాల స్థానం ఏంటి?

Published by: Khagesh

ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలపై ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్షిక నివేదిక విడుదలైంది.

డెన్మార్క్‌కు చెందిన కోపెన్‌హాగన్ వరుసగా రెండో ఏడాది అత్యంత నివాసయోగ్యమైన నగరంగా టాప్‌లో ఉంది.

రెండో స్థానంలో వియన్నా ఉంది. గతంలో ఈ నగరమే వరుసగా మూడుసార్లు టాప్‌లో నిలిచింది.

టాప్ ఐదు నగరాల జాబితాలో మెల్‌బోర్న్, సిడ్నీ, జ్యూరిచ్ ఉన్నాయి.

స్విట్జర్లాండ్‌లోని జెనీవా ఆరో స్థానంలో ఉంది. ఏడో స్థానంలో జపాన్‌లోని ఒసాకా, ఎనిమిదో ప్లేస్‌లో అడిలైడ్ ఉంది.

కెనడాలోని వాంకోవర్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. జపాన్ రాజధాని అయిన టోక్యో పదో స్థానంలో ఉంది.

ఈ జాబితాలో ఢిల్లీ 120వ స్థానంలో ఉంటే, ముంబై 121వ స్థానంలో ఉంది.

భారత్‌ నగరాల స్కోరు భారీగా పడిపోయినా జీవనప్రమాణం, మౌలిక సదపాయాల్లో పెరుగుదల ఉన్నట్టు సర్వే పేర్కొంది.

స్థిరత్వం, ఆరోగ్యం, విద్య, పటిష్టమైన మౌలిక సదుపాయాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.