ఉప్పు ఎక్కువ తిన్నారా... వెంటనే ఇవి తినేస్తే బ్యాలెన్స్ అవుతుంది



ఒక్కోసారి వండిన వంటకాల్లో ఉప్పు ఎక్కువ పడిపోతుంది. అయినా సరే ఎలాగోలా తినేస్తూ ఉంటారు చాలా మంది.



ఉప్పు ఎక్కువైన ఆహారం తిన్నప్పుడు ఆ ప్రభావం శరీరంపై తగ్గించాలంటే కొన్ని రకాల ఆహారాలను వెంటనే తినేయాలి. దీని వల్ల ఉప్పు వల్ల కలిగే రిస్క్ కాస్త తగ్గుతుంది.



గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు కలిగిన వారు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ఉప్పు అధికంగా తిన్నట్టు అయితే వెంటనే ఈ ఆహారాలను కూడా తినాలి.



పొటాషియం పుష్కలంగా ఉన్న ఆహారం అరటిపండు. ఉప్పు నిండిన ఆహారం తిన్నాక మీ రక్తపోటు స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అరటి పండు తింటే ఆ స్థాయిలు అదుపులో ఉంచేందుకు సహకరిస్తుంది.



అధిక సోడియాన్ని ఎదుర్కోగల సత్తా పెరుగుకి ఉంది. ఉప్పు ఎక్కువున్న ఆహారంలో దీన్ని కలుపుకుని తిన్నా, లేక తరువాత తిన్నా కూడా మంచి ఫలితమే ఉంటుంది.



కాస్త తియ్యగా, పుల్లగా ఉండే కివిలో కూడా పొటాషియం ఉంటుంది. శరీరంలో చేరిన సోడియాన్ని తటస్థీకరించడంలో ముందుంటుంది.



ఉప్పు అధికంగా తిన్నాం అనిపిస్తే వెంటనే అల్లం టీ చేసుకుని తాగేయాలి. ఇది శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తాయి.