కస్టమర్లకు అలర్ట్‌! బ్యాంకు పనులుంటే ప్లాన్‌ చేసుకోండి.

దీపావళి పండుగకు వరుసగా 6 రోజులు సెలవులు ఇచ్చారు.

శనివారం నాలుగో శనివారం. అలాగే ధన త్రయోదశి సెలవు.

ఆదివారం వారాంతపు సెలవు ఉంది.

సోమవారం దీపావళి సెలవు ఇచ్చారు. కాళీ పూజ, లక్ష్మీపూజ ఉన్నాయి.

మంగళవారం గోవర్దన్‌ పూజ ఉంది. గ్యాంగ్‌టక్‌, హైదరాబాద్‌, ఇంఫాల్‌, జైపుర్‌లో సెలవు.

బుధవారం విక్రమ్‌ సంవత్‌ కొత్త ఏడాది సెలవు. భాయిదూజ్‌ ఉంది.

బుధవారం అహ్మదాబాద్‌, బెలాపూర్‌, బెంగళూరు, డెహ్రాడూన్‌, గ్యాంగ్‌టక్‌, జమ్ము, కాన్పుర్‌, లక్నో, ముంబయి, నాగ్‌పుర్‌, సిమ్లా, శ్రీనర్‌లో సెలవు.

గురువారం భాయిదూజ్‌, చిత్రగుప్త జయంతి, నింగాల్‌ చక్కోబా సందర్భంగా గ్యాంగ్‌టక్‌, ఇంఫాల్‌, కాన్పూర్‌లో సెలవు.

ఆర్బీఐ చట్ట ప్రకారం అక్టోబర్లో 21 రోజులు సెలవులు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి ఇవి ఇస్తారు.