బిట్‌కాయిన్ (Bitcoin) 0.28 శాతం తగ్గి రూ.19.34 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.68 శాతం తగ్గి రూ.1,34,709 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.23 శాతం తగ్గి రూ.82.72, బైనాన్స్ కాయిన్ 0.90 శాతం తగ్గి రూ.21,128, రిపుల్ 0.22 శాతం పెరిగి రూ.31.24, యూఎస్‌డీ కాయిన్ 0.21 శాతం తగ్గి రూ.82.71, కర్డానో 0.04 శాతం తగ్గి రూ.30.19, డోజీ కాయిన్ 0.06 శాతం పెరిగి 6.78 వద్ద కొనసాగుతున్నాయి. క్రిప్టో గ్లేడియేటర్, కస్పా, ఎలూర్, నెమ్, టెల్ కాయిన్, సింగులారిటీ నెట్ లాభపడ్డాయి. డెఫిగ్రామ్, యాక్సెస్ ప్రొటొకాల్, ఈకాయిన్, ఆర్‌ఎస్‌కే ఇన్‌ఫ్రా, బోన్ షిబా స్వాప్, కాన్ ఫ్లక్స్, ఓకేసీ నష్టపోయాయి.