ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 73 పాయింట్లు తగ్గి 17,392 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 175 పాయింట్ల తగ్గి 59,288 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 397 పాయింట్లు పెరిగి 40,307 వద్ద స్థిరపడింది. ఐసీఐసీఐ బ్యాంకు, పవర్ గ్రిడ్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఆటో, యూపీఎల్, టాటా స్టీల్, ఇన్ఫీ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 82.84 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.56,020గా ఉంది. కిలో వెండి రూ.700 తగ్గి రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.24,170 వద్ద ఉంది. బిట్‌కాయిన్ (Bitcoin) 1.28 శాతం పెరిగి రూ.19.48 లక్షల వద్ద కొనసాగుతోంది.