బిట్‌కాయిన్ (Bitcoin) 2.04 శాతం తగ్గి రూ.19.80 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.77 శాతం తగ్గి రూ.1,37,048 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.06 శాతం పెరిగి రూ.82.82, బైనాన్స్ కాయిన్ 0.01 శాతం తగ్గి రూ.25,799, రిపుల్ 1.79 శాతం తగ్గి రూ.32.25, యూఎస్‌డీ కాయిన్ 0.11 శాతం పెరిగి రూ.82.82, కర్డానో 2.41 శాతం తగ్గి 31.70, డోజీ కాయిన్ 0.06 శాతం పెరిగి 7.01 వద్ద కొనసాగుతున్నాయి. బ్లాక్స్, మెరిట్ సర్కిల్, ఆడియస్, ఫ్లెక్స్ కాయిన్, పుండి ఎక్స్, బిట్‌గెర్ట్, ఓకేసీ లాభపడ్డాయి. కాయిన్ మెట్రో, అల్కెమీ పే, ఆంక్రూ నెట్‌వర్క్, సినాప్సీ, నియో, అలెప్ జీరో, మ్యాజిక్ నష్టపోయాయి.