ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 43 పాయింట్లు పెరిగి 17,511 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 139 పాయింట్ల పెరిగి 59,605 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 5 పాయింట్లు పెరిగి 40,001 వద్ద స్థిరపడింది. హిందాల్కో, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. ఏసియన్ పెయింట్స్, ఎల్‌టీ, టైటాన్, దివిస్ ల్యాబ్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలపడి రూ.82.73 వద్ద ముగిసింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 220 తగ్గి రూ.56,510గా ఉంది. కిలో వెండి రూ.68,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.310 పెరిగి రూ.25,390 వద్ద ఉంది. బిట్‌కాయిన్ (Bitcoin) 1.63 శాతం పెరిగి రూ.20.22 లక్షల వద్ద కొనసాగుతోంది.