గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.34 శాతం తగ్గి రూ.20.48 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 1.56 శాతం తగ్గి రూ.1,39,353 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.09 శాతం పెరిగి రూ.82.79, బైనాన్స్ కాయిన్ 1.48 శాతం తగ్గి రూ.25,954, రిపుల్ 0.12 శాతం పెరిగి రూ.32.49, యూఎస్‌డీ కాయిన్ 0.29 శాతం పెరిగి రూ.82.86, కర్డానో 2.39 శాతం తగ్గి 32.85, డోజీ కాయిన్ 0.13 శాతం తగ్గి 7.17 వద్ద కొనసాగుతున్నాయి. కాయిన్ మెట్రో, వీమిక్స్, బిట్‌కాయిన్ గోల్డ్, సింగులారిటీ నెట్, ఫెచ్ ఏఐ, ఎన్‌ఈవో, స్టాక్స్ లాభపడ్డాయి. మెటిస్, క్లేటాన్, బ్లాక్స్, లుస్కో, బేబీ డోజీ, అల్కెమీ పే, ఫ్లోకి నష్టపోయాయి.