ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17 పాయింట్లు తగ్గి 17,826 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 18 పాయింట్ల తగ్గి 60,672 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ 28 పాయింట్లు తగ్గి 40,673 వద్ద ముగిసింది. ఎన్‌టీపీసీ, బ్రిటానియా, టాటా స్టీల్, రిలయన్స్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు బలహీనపడి రూ.82.79 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 100 తగ్గి రూ.56,730గా ఉంది. కిలో వెండి రూ.68,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.24,610 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 0.34 శాతం తగ్గి రూ.20.48 లక్షలు వద్ద ఉంది.