బిట్‌కాయిన్ 2.28 శాతం తగ్గి రూ.23.96 లక్షల వద్ద ఉంది. ఎథీరియమ్ 6.13 శాతం తగ్గి రూ.1,62,558 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.22 శాతం పెరిగి రూ.82.25, బైనాన్స్ కాయిన్ 4.74 శాతం పెరిగి రూ.26,867, రిపుల్ 4.65 శాతం తగ్గి రూ.40.37, యూఎస్‌డీ కాయిన్ 0.22 శాతం పెరిగి రూ.82.20, కర్డానో 6.16 శాతం తగ్గి రూ.34.25, డోజీ కాయిన్ 0.48 శాతం తగ్గి 7.23 వద్ద కొనసాగుతున్నాయి. పెపె, కార్టెసీ, టామినెట్, కాయిన్ మెట్రో, సెలెర్ నెట్‌వర్క్, పాలీమ్యాథ్, వైట్‌బిట్‌కాయిన్ లాభపడ్డాయి. కస్పా, బ్లాక్స్, స్ట్రైడ్, లిక్విడిటీ, బ్లర్, ఆర్బిట్రమ్, సెల్సియస్ నెట్‌వర్క్ నష్టపోయాయి.