ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 41 పాయింట్లు తగ్గి 17,618 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 159 పాయింట్లు తగ్గి 59,567 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 111 పాయింట్లు తగ్గి 42,154 వద్ద స్థిరపడింది. బీపీసీఎల్, దివిస్ ల్యాబ్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంకు, ఎం అండ్ ఎం షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫీ, ఎస్‌బీఐ లైఫ్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు బలహీనపడి 82.23 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.230 పెరిగి రూ.61,150గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.77,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.28,420 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 1.90% పెరిగి రూ.24.06 లక్షల వద్ద ఉంది.