ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 46 పాయింట్లు తగ్గి 17,660 వద్ద ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 183 పాయింట్లు తగ్గి 59,727 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 2 పాయింట్లు పెరిగి 42,265 వద్ద స్థిరపడింది. దివిస్ ల్యాబ్, హెచ్‌సీఎల్ టెక్, సిప్లా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సెమ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, టైటన్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలపడి 82.04 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.60,920గా ఉంది. కిలో వెండి రూ.1100 తగ్గి రూ.77,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.27,660 వద్ద ఉంది. బిట్‌కాయిన్ (Bitcoin) 0.17 శాతం తగ్గి రూ.24.44 లక్షల వద్ద కొనసాగుతోంది.