బిట్‌కాయిన్1.13 శాతం పెరిగి రూ.21.45 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.31 శాతం పెరిగి రూ.1,44,580 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.03 శాతం పెరిగి రూ.82.46, బైనాన్స్ కాయిన్ 0.12 శాతం తగ్గి రూ.19,397, రిపుల్ 2.72 శాతం పెరిగి రూ.43.04, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం తగ్గి రూ.82.41, లిడో స్టేక్డ్ ఈథర్ 0.35 శాతం పెరిగి రూ.144,494 డోజీ కాయిన్ 0.01 శాతం తగ్గి రూ.5.07 వద్ద కొనసాగుతున్నాయి. ఫ్లెక్స్ కాయిన్, టోమో చైన్, సైబర్ హార్పర్, సుయి, డీసెంట్రలాండ్, కర్డానో లాభపడ్డాయి. శార్డస్, సేఫ్‌మూన్, రాకెట్ పూల్, థార్‌చైన్, బేబీ డోజీ, జీఎంఎస్, స్విస్ బోర్గ్ నష్టపోయాయి.