నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 18,601 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ 99 పాయింట్లు ఎగిసి 62,724 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 44 పాయింట్లు తగ్గి 43,944 వద్ద ముగిసింది. బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, ఎల్‌టీ, సిప్లా, మారుతీ, టైటాన్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలపడి 82.43 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.60,450గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.74,౩00 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.25,560 వద్ద ఉంది. బిట్‌కాయిన్ రూ.21.45 లక్షల వద్ద ఉంది.