బిట్‌కాయిన్ (Bitcoin) 0.45 శాతం తగ్గి రూ.18.27 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.50 శాతం తగ్గి రూ.1,27,853 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.07 శాతం తగ్గి రూ.81.84, బైనాన్స్ కాయిన్ 0.13 శాతం తగ్గి రూ.23,375, రిపుల్ 2.21 శాతం పెరిగి రూ.26.75, యూఎస్‌డీ కాయిన్ 0.05 శాతం తగ్గి రూ.81.84 కర్డానో 1.88 శాతం తగ్గి రూ.26.75, డోజీ కాయిన్ 0.07 శాతం తగ్గి 6.04 వద్ద కొనసాగుతున్నాయి. యాక్సెస్ ప్రొటొకాల్, మాస్క్ నెట్‌వర్క్, ఫ్లెక్స్ కాయిన్, బ్లెడ్‌ఎక్స్, ఫ్లోకి, ఎవర్‌స్కేల్, రెన్ లాభపడ్డాయి. లిక్విడిటీ, సింథెటిక్స్ నెట్‌వర్క్, ఆర్‌ఎస్‌కే ఇన్ఫ్రా, స్టాక్స్, బైకానమీ, ఆర్టిఫీషియల్ లిక్విడ్, ఓకేబీ నష్టపోయాయి.