బిట్‌కాయిన్ (Bitcoin) 0.12 శాతం పెరిగి రూ.18.31 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.18 శాతం తగ్గి రూ.1,28,206 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.05 శాతం పెరిగి రూ.81.85 బైనాన్స్ కాయిన్ 0.11 శాతం తగ్గి రూ.23,722, రిపుల్ 0.56 శాతం తగ్గి రూ.30.64, యూఎస్‌డీ కాయిన్ 0.03 శాతం పెరిగి రూ.81.80, కర్డానో 0.31 శాతం పెరిగి రూ.29.46, డోజీ కాయిన్ 0.07 శాతం పెరిగి 6.16 వద్ద కొనసాగుతున్నాయి. సీయూఎస్‌డీటీ, యాక్సెస్ ప్రొటికాల్, ట్రూ ఫై, రాల్‌బిట్ కాయిన్, బేబీ డోజీ, ఆర్టిఫీషియల్ లిక్విడ్ ఇంటెల్లిజెంట్, సింగులారిటీ నెట్ లాభపడ్డాయి. ను సైఫర్, ఆర్‌ఎస్‌కే ఇన్ఫ్రా, స్టాక్స్, డావో మేకర్, సియాకాయిన్, డీవైడీఎక్స్, లిడో డావో నష్టపోయాయి.