బిట్‌కాయిన్ (Bitcoin) 2.89 శాతం తగ్గి రూ.22.27 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 1.66 శాతం తగ్గి రూ.1,42,346 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.24 శాతం తగ్గి రూ.82.33, బైనాన్స్ కాయిన్ 5.33 శాతం తగ్గి రూ.25,535, రిపుల్ 6.57 శాతం పెరిగి రూ.40.28, యూఎస్‌డీ కాయిన్ 0.08 శాతం తగ్గి రూ.82.38, కర్డానో 0.45 శాతం పెరిగి రూ.28.96, డోజీ కాయిన్ 0.01 శాతం తగ్గి 5.98 వద్ద కొనసాగుతున్నాయి. జోయి, కస్పా, ఫ్లేర్, ఎక్స్‌పీ, జీఎంక్స్, వీమిక్స్ లాభపడ్డాయి. టామినెట్, బిట్‌కాయిన్ అవలాంచె, ఫ్లెక్స్ కాయిన్, సెలెర్ నెట్‌వర్క్, లైవ్‌పీర్, కాయిన్ మెట్రో, ఆర్బిట్రామ్ నష్టపోయాయి.