బిట్‌కాయిన్ (Bitcoin) 1.37 శాతం పెరిగి రూ.19.61 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 1.61 శాతం పెరిగి రూ.1,36,892 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.38 శాతం తగ్గి రూ.82.40, బైనాన్స్ కాయిన్ 0.34 శాతం పెరిగి రూ.25,217, రిపుల్ 1.25 శాతం పెరిగి రూ.31.62, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం పెరిగి రూ.82.74, ఓకేబీ 0.04 శాతం పెరిగి రూ.4308, డోజీ కాయిన్ 0.12 శాతం పెరిగి 6.80 వద్ద కొనసాగుతున్నాయి. ఆర్‌ఎస్‌కే, లిక్విడిటీ, ఆర్టిఫీషియల్ లిక్విడ్, ఫ్లెక్స్ కాయిన్, స్టాక్స్, అగోరిక్, సింగులారిటీ నెట్ లాభపడ్డాయి. బిట్ కాయిన్ అవలాంచె, యాక్సెస్ ప్రొటొకాల్, బేబీ డోజీకాయిన్, కోకోస్ బీసీఎక్స్, బిట్‌జెర్ట్, ఎల్యూర్, అల్కెమీ పే నష్టపోయాయి.